కాంగ్రెస్ ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలతో  చేస్తున్న ప్రచారాల్లో ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని వినోద్ కూతురు గడ్డం వర్ష పేర్కొన్నారు.

శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో గడ్డం వర్ష కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మహిళ రాష్ట్ర కార్యదర్శి రొడ్డ శారద, సీనియర్ లీడర్ కంకటి శ్రీనివాస్ లతో కలిసి ఎన్నికల ప్రచారం  నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలే వేసి నివాళులర్పించారు.