
ములుగు, వెలుగు: తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని , ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు చికెన్ ని కోడిగుడ్లను వినియోగించవచ్చని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. గురువారం ములుగులోని ఎండీ పౌల్ట్రీ ఆధ్వర్యంలో చికెన్, ఎగ్ మేళా నిర్వహించి ప్రజలకు చికెన్ కూరా , ఉడికిన కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ.... 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడకడం వల్ల చికెన్ , గుడ్లు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
ప్రజలకు చౌకగా దొరికే పోషక విలువలున్న మాంసాహారం చికెన్ మాత్రమే అన్నారు. అపోహలు లేకుండా చికెన్ , కోడిగుడ్ల ను వినియోగించాలని సూచించారు. ఏ టు జెడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జుబేర్ పాషా, మహదేవుని శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్, శ్రీను, నాగేష్, సులేమాన్, రవీందర్ గౌడ్, సలీం, ఖలీల్, జాంగిర్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
దుబ్బాక, వెలుగు: వెన్‌కాబ్ ఆధ్వర్యంలో గురువారం దుబ్బాక పట్టణంలో నిర్వహించిన ఉచిత చికెన్, ఎగ్ మేళాకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. వండిన 240 కిలోల చికెన్, ఉడకబెట్టిన 2వేల కోడి గుడ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన వెంకటేశ్వర హెచరీస్ కామారెడ్డి బ్రాంచ్ మేనేజర్ జయరాంరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆందోళన చెందకుండా నిర్భయంగా చికెన్‌ను తినొచ్చని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం, కోడి గుడ్లను 70 సెంటి గ్రేడ్లోఉడికించి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావన్నారు. వీటి వల్ల ప్రోటిన్ లభిస్తోందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్ర్తీయంగా నిరూపిస్తున్నారని వెల్లడించారు. వెన్‌కాబ్ సంస్థ, చికెన్ సెంటర్ల సహకారంతో దుబ్బాక పట్టణంలో నిర్వహించిన చికెన్ మేళాకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. అపోహాలు లేకుండా ప్రజలు హాయిగా చికెన్ తినొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ స్వామి పాల్గొన్నారు.