- చివరి రోజు ఆదిలాబాద్లో 975, నిర్మల్లో 1019 అప్లికేషన్లు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయంలో నిర్వహించిన మద్యం దుకాణాలకు భారీగా టెండర్లు పడ్డాయి. శుక్రవారం దరఖాస్తులకు ఆఖరి రోజు కావడంతో వ్యాపారులతో కార్యాలయం సందడిగా మారింది. జిల్లాలో మొత్తం 40 మద్యం దుకాణాలకు 975 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఆదిలాబాద్ పరిధిలో 628, ఇచ్చోడలో 219, ఉట్నూర్ లో 128 దరఖాస్తులు వచ్చాయి. కొందరు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి దరఖాస్తులు అందజేశారు. 21న లక్కీ డ్రా ద్వారా వైన్స్ ను కేటాయించనున్నారు.
నిర్మల్: నిర్మల్ జిల్లాలోని మొత్తం 47 మద్యం దుకాణాలకు1, 019 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం దరఖాస్తులకు చివరి రోజు కావడంతో ఆశావాహులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ లోని ఎక్సైజ్ ఆఫీసుకు తరలివచ్చారు. సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్న వారందరికీ ఎక్సైజ్ అధికారులు టోకెన్లు జారీ చేశారు. మద్యం వ్యాపారులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారాలు చేసేవారు కూడా ఈసారి మద్యం దుకాణాల కోసం దరఖాస్తు లుచేసుకున్నారు.
మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో 73 వైన్స్ లకు 2231 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం 1256 దాఖలయ్యాయి.
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలోని 32 వైన్స్ షాపులకు చివరి రోజు 400 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 966 టెండర్లు దాఖలయ్యాయి.