ఢిల్లీ: రైల్వేకు పండగ నెలలైన సెప్టెంబర్, అక్టోబర్లల్లో రూ. 12,159.35 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రయాణికులు టిక్కెట్లు రద్దు చేయడం వల్ల జమ అయిన మొత్తాన్ని విడిగా లెక్కించడం లేదన్నారు. బుధవారం ఆయన లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం అందజేశారు.1 సెప్టెంబర్ నుంచి 10 నవంబర్ వరకు మొత్తం 143.71 కోట్ల మంది రైళ్లల్లో ప్రయాణించారని వివరించారు. పండుగ సీజన్‌లో 7,983 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు పేర్కొన్నారు.