సొంతూళ్లకు ఓటర్లు.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

 ఓటర్లు హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు క్యూ కట్టారు.  దీంతో సిటీలోని బస్టాండ్లుల్లో ఫుల్ రష్ కనిపిస్తోంది ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులతో పాటు సోమవారం ఎన్నికల హాలిడేతో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఇంటికి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మే 13న ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే బస్టాండ్లులన్నీ ప్రయాణికులతో రష్ కనిపిస్తోంది. 

మరోవైపు యాదాద్రి చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇటు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. కొత్తగూడెం నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై 5 కిలో మీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఏపీ కోసం ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్  అయిపోయాయి. ఈ నెల 10, 11, 12 తేదీల్లో 400 బస్సులకు ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదనంగా మరో 150కి పైగా ప్రత్యేక బస్సులను 10న ఆన్ లైన్ లో పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ జిల్లాలకు 10, 11 12 తేదీల్లో 1,400 సర్వీసులను ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతోంది.