కొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు.. అంజన్న దర్శనానికి 2 గంటల సమయం

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.  స్వామివారి ఆలయ ప్రాంగాణం భక్తుల క్యూలైన్లతో నిండి వెలుపల వరకు బారులు తీరారు. అంజన్న దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. 

ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను బొజ్జ పోతన్న పార్కింగ్ ప్లేస్ లోనే పార్కింగ్ చేపిస్తున్నారు అధికారులు. దీంతో భక్తులు కాలినడకన గుట్టకు చేరుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో అధికారులు విఫలమవుతున్నారని భక్తులు మండిపడుతున్నారు. తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.