యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుండడంతో భక్తులు భారీ క్యూలైన్లలో దర్శనమిస్తున్నారు. ఆలయ మాడ వీధుల్లో సరిపడా చలువ పందిర్లు లేకపోవడంతో ఎండ వేడికి భక్తులు తట్టుకోలేక బయటే సేదతీరుతున్నారు.