కొడిచెర్లలో భారీ ఇసుక డంపులు సీజ్

కొడిచెర్లలో భారీ ఇసుక డంపులు సీజ్

పోతంగల్ (కోటగిరి), వెలుగు : పోతంగల్ మండల పరిధిలోని కోడిచెర్ల గ్రామ శివారులో అక్రమ ఇసుక నిలువ స్థావరాలపై రెవెన్యూ సిబ్బంది గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కోడిచెర్ల గ్రామంలో సుమారు 48 ట్రాక్టర్ల  ఇసుక డంప్ లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ కే గంగాధర్ తెలిపారు.

 సీజ్​ అయిన ఇసుకను  ప్రభుత్వ పనులకు కోసం లేదా  డీడీలు కట్టిన వారికి సరఫరా చేస్తామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక డంపులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్​ హెచ్చరించారు.