పోతంగల్లో భారీ ఇసుక డంప్ సీజ్

పోతంగల్, వెలుగు : పోతంగల్ మండల కేంద్రంలో భారీ ఇసుక డంప్ సీజ్ చేసినట్లు ఇన్​చార్జి తహసీల్దార్ సురేందర్ నాయక్ తెలిపారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మంజీరా పరీవాహక ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది నది ఒడ్డున అక్రమంగా డంప్ చేసిన 100 ట్రిప్పుల ఇసుకను గుర్తించారు. ఈ ఇసుక నిల్వలను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు.