ఇలాంటి స్కీం ఎత్తేయక ఏం చేస్తారు : గుంటకు 5 లక్షలు.. రెండేళ్ల తర్వాత భూమి, డబ్బులు కూడా ఇస్తారంట..!

ఇలాంటి స్కీం ఎత్తేయక ఏం చేస్తారు : గుంటకు 5 లక్షలు.. రెండేళ్ల తర్వాత భూమి, డబ్బులు కూడా ఇస్తారంట..!

ఓ వస్తువు కొనాలంటే ఏం చేస్తాం.. ఎంత ధర ఉంటే అంత చెల్లించి సొంతం చేసుకుంటాం.. అదే భూమి అయితే భూమి తీసుకుని డబ్బులు ఇస్తాం.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రం విచిత్రమైన స్కీం పెట్టింది.. ఆ స్కీం చూసినా.. విన్నా.. ఈ కంపెనీ ఎత్తేయటానికే అని బుర్ర ఉన్న ఎవరికైనా అర్థం అయిపోతుంది.. ఇంతకీ ఆ స్కీం ఏంటో.. ఆ స్కీం పేరుతో కోట్ల రూపాయలు దోచుకుని బోర్డు తిప్పేసిన కంపెనీ వివరాలు ఏంటో తెలుసుకుందామా..

రియల్ ఎస్టేట్ స్కీం వివరాలు ఇలా :

మాకు 30 ఎకరాల భూమి ఉంది. గుంటకు 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టండి.. 25 నెలలపాటు ప్రతినెలా 5 లక్షలకు 2 రూపాయల వడ్డీ ఇస్తాం.. 25వ నెల 5 గుంటల భూమి మీదే అవుతుంది.. మీరు ఇచ్చిన 5 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తాం.. ఇది ఎక్కడైనా సాధ్యమా.. ఏ వ్యాపారంలో అయినా ఇలా జరుగుతుందా.. 5 లక్షలకు ఐదు లక్షలు ఇవ్వటం ఏంటీ.. 5 లక్షలకు ప్రతినెలా 2 రూపాయలు వడ్డీ ఇవ్వటం ఏంటీ.. 25వ నెల.. 5 లక్షలతోపాటు గుంట భూమి ఇవ్వటం ఏంటీ.. ఇది వ్యాపారం అనరు.. మోసం చేయటం అంటారు.. ఇప్పుడు ఇలాగే చేసిన వీఓన్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ.

కంపెనీ చేతిలో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. 30 ఎకరాలలో భూమి ఉందని చెప్పి గుంట చొప్పున నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, కట్టిన డబ్బులలో నెలకు నాలుగు శాతం వడ్డీ ఇస్తూ మెంబర్స్ ను చేర్చుకున్నారని తెలిపారు బాధితులు.

తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయానికి ఆకర్షితులైన వందల సంఖ్యలో బాధితులు డబ్బులు పెట్టుబడి పెట్టారు. ఈ స్కాం విలువ కొన్ని కోట్లలో ఉండచ్చని తెలుస్తోంది. నిందితుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.