అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ ప్రజలు సొంతూరు బాట పట్టారు. మే11వ తేదీ శనివారం ఉదయం నుంచి ఏపీ వాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో నగర శివార్లలో ఉన్న కొర్లపాడు టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ లేట్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడున్నారు. దీంతో వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాయి.
హైదరాబాద్ నుంచి ఏపీకి జనం క్యూ కట్టారు. ఈరోజు నుంచి వరుస సెలవులతో ఇంటికి వెళ్లుందుకు పబ్లిక్ క్యూ కడుతున్నారు. కొర్రపాడు టోల్ గేట్ దగ్గర నాలుగు టోల్ బూతులు తెరిచి విజయవాడ వైపు వాహనాలను పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ సీట్లు దొరకకపోవడంతో సొంత వాహనాల్లో ఏపీకి వెళ్తున్నారు.
మే 13న తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఓట్లు వేసేందుకు సొంతూళ్ల జనం పయనమయ్యారు. దీంతో సిటీలోని బస్టాండ్లుల్లో ఫుల్ రష్ కనిపిస్తోంది ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులతో పాటు సోమవారం ఎన్నికల హాలిడేతో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఇంటికి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మే 13న ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే బస్టాండ్లులన్నీ ప్రయాణికులతో రష్ కనిపిస్తోంది.