కేటీఆర్ రోడ్డు షోతో వాహనదారుల ఇబ్బందులు

నల్గొండ జిల్లా: చౌటుప్పల్లో మంత్రి కేటీఆర్ రోడ్డు షోతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మంత్రి రోడ్డు షోతో NH65 జాతీయ రహదారి హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డును పోలీసులు మూసివేశారు. దీనికి తోడు ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. చిట్యాల సెంటర్ నుంచి భువనగిరి వైపుకు వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్‌షోకు 4 గంటల ముందు ఆంక్షలు విధించడంతో పోలీసులపై వాహనదారులు మండిపడుతున్నారు. ట్రాఫిక్ జాంతో కేటీఆర్ చౌటుప్పల్ కు ఆలస్యంగా  చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులుపై ఎమ్మేల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, చౌటుప్పల్ చౌరస్తాలో మంత్రి జగదీష్ రెడ్డి కేటీఆర్ కు స్వాగతం  పలికారు.