ఎయిడెడ్ స్కూళ్లలో భారీగా ఖాళీలు

  • ఎయిడెడ్ స్కూళ్లలో 3,643 పోస్టులు ఖాళీ
  • 678 స్కూళ్లలో 1,938 మందే టీచర్లు
  • ఇర్రెగ్యులర్ గా శాలరీస్.. డొనేషన్లతోనే మెయింటనెన్స్

ఆదిలాబాద్, వెలుగు: ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించిన ఎయిడెడ్​ స్కూళ్లను  రాష్ట్ర సర్కారు ఎట్టికి వదిలేసింది. ఏండ్ల తరబడి టీచర్​పోస్టులను భర్తీ చేయకపోవడంతో పనిచేస్తున్న టీచర్ల కంటే ఖాళీలే ఎక్కువున్నయి. ఉన్న టీచర్లకూ శాలరీస్​ టైం టు టైం వస్తలేవు. మెయింటనెన్స్​కు కూడా సర్కారు పైసలు ఇస్తలేదు. దీంతో పిల్లలిచ్చే డొనేషన్లు, ఫీజులతోనే ఎల్లదీయాల్సిన పరిస్థితి వచ్చింది.

విద్యాశాఖ పరిధిలోనే..

స్టేట్​వైడ్​ ప్రస్తుతం 290 ప్రైమరీ, 124 అప్పర్ ప్రైమరీ, 264 హైస్కూళ్లు మొత్తంగా 678 ఎయిడెడ్​ స్కూల్స్​ రన్​ అవుతున్నాయి. వాస్తవానికి వీటిని ప్రైవేట్​యాజమాన్యాలే నడిపించినా, పెత్తనమంతా విద్యాశాఖదే. సర్కారు బళ్ల మాదిరిగానే టీచర్ల నియామకం, వారికి శాలరీస్,  పిల్లలకు ఫ్రీగా యూనిఫాంలు, టెక్స్ట్​బుక్స్​, స్కాలర్​షిప్స్​ అన్నీ విద్యాశాఖే చూసుకుంటుంది. ఫీజులను, డొనేషన్లను కూడా గవర్నమెంట్​ ఫిక్స్​ చేస్తుంది.1970 లో ప్రారంభమైన ఎయిడెడ్ స్కూల్ సిస్టమ్​ మూడు దశాబ్దాల పాటు సక్సెస్​ఫుల్​గా రన్​ అయింది. అతి తక్కువ ఫీజులు, క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందిస్తూ వచ్చిన ఈ స్కూళ్లకు ఒకప్పుడు మంచి క్రేజ్​ ఉండేది. ఎప్పుడూ టీచర్స్, పిల్లలతో కళకళ లాడేవి. కానీ  ప్రభుత్వాలు క్రమంగా ఎయిడెడ్​ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ రావడంతో ప్రస్తుతం కళతప్పాయి.

అన్ని వసతులు ఉన్నా..

రాష్ట్రవ్యాప్తంగా పలు సిటీలు, టౌన్లు, మండలకేంద్రాలు, ఇతరత్రా కీలకమైన సెంటర్లలో ఉన్న ఎయిడెడ్​ స్కూళ్లకు మంచి బిల్డింగులు, క్లాస్​రూమ్​లు, ల్యాబ్​లు, ప్లేగ్రౌండ్స్​, ఫర్నిచర్​ఇలా అన్ని ఫెసిలిటీస్​ ఉన్నాయి. లేనిదల్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధి మాత్రమే. సుమారు 18ఏండ్లుగా ఎయిడెడ్​ స్కూళ్లలో టీచర్​ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయట్లేదు. స్టేట్​వైడ్​ 3,643 ఖాళీలు ఉండగా, కేవలం 1,938 మంది మాత్రమే రెగ్యులర్​ టీచర్లు పనిచేస్తున్నారు. వీరికి గవర్నమెంట్ టీచర్స్ లాగే బేసిక్ పే, ఇతర అలవెన్సులతో కూడిన శాలరీస్​ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ  010 హెడ్ ప్రకారం ఇవ్వట్లేదు.  ఎయిడెడ్ టీచర్ల జీతాలకు సంబంధించిన బడ్జెట్​ను టైం టు టైం రిలీజ్​ చేయట్లేదు. దీంతో రెగ్యులర్​గా శాలరీస్​ రావట్లేదు.  ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్సులదీ ఇదే పరిస్థితి. గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చే మెడికల్ రీయింబర్స్​మెంట్​,  హెల్త్ కార్డుల ఫెసిలిటీ కూడా వీళ్లకు కల్పించలేదు. ఎయిడెడ్​ స్కూళ్ల మెయింటనెన్స్​కు సైతం ప్రభుత్వం ఫండ్స్​ఇవ్వకపోవడంతో స్టూడెంట్స్​ ఇచ్చే డొనేషన్లు, ఫీజులతోనే నడుపుతున్నారు. టెంపరరీ టీచర్లను నియమించుకొని జీతాలు ఇస్తున్నారు. దీంతో క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందక స్టూడెంట్స్​క్రమంగా ప్రైవేట్ స్కూళ్లవైపు మళ్లుతున్నారు. సర్కారు నుంచి సహకారం లేక ఇప్పటికే కొన్ని ఎయిడెడ్​ స్కూళ్లు మూతపడగా, పరిస్థితి ఇలాగే ఉంటే మంచి ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఎయిడెడ్ స్కూల్​ అనేవి ఇక ముందు కనిపించవని ఎడ్యుకేషన్​ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు.

మా స్కూల్ ను చూస్తే బాధగా ఉంది..

నేను పదోతరగతి వరకు సెయింట్ జోసెఫ్ ఎయిడెడ్ స్కూల్ లో చదివాను. టీచర్లు ఎంతో కమిట్​మెంట్​తో చదువులు చెప్పేవారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లీన్​ఎయిడెడ్​ స్కూళ్ల లో కనిపించేవి.  నేను రైల్వే స్టేషన్ మాస్టర్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించానంటే మా ఎయిడెడ్ స్కూల్ పుణ్యమే. ఇప్పుడు ఆ పాత స్కూల్ ను చూస్తేనే బాధ కలుగుతోంది. అక్కడ నేను చదివినప్పుడు ఉన్న అటెండర్​ తప్ప మరెవరూ లేరు.

–పెద్దపల్లి ఇంద్రసేన్, రైల్వే స్టేషన్ మాస్టర్, రేచిని రోడ్

For More News..

జై భారత్.. జై శ్రీరాం.. జై కేసీఆర్​ అనాలె

ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

గతేడాది ట్రాపిక్ ఫైన్లు రూ. 613 కోట్లు.. హెల్మెట్ కేసులే ఎక్కువ

త్వరలో నిరుద్యోగ భృతి.. రేపోమాపో కేసీఆర్​ అనౌన్స్​మెంట్