మేడిగడ్డ లెక్కనే అన్నారం! .. పిల్లర్ల కింది నుంచి భారీగా వాటర్‌‌‌‌ లీకేజీ

  • లీకేజీని ఆపేందుకు అడ్డుగా సిమెంట్​, ఇసుక బస్తాలు
  • చివరికి ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ ఆదేశాలతో నీళ్లను ఖాళీ చేస్తున్న ఆఫీసర్లు
  • ​10 గేట్లు తెరిచి 6,750 వేల క్యూసెక్కులకు పైగా వాటర్​ రిలీజ్​
  • గతంలో 10 చోట్ల పడిన బుంగలు.. డేంజర్​ జోన్​లో అన్ని పిల్లర్లు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లోని బ్యారేజీల దగ్గర డేంజర్‌‌‌‌ బెల్స్‌‌‌‌ మోగుతూనే ఉన్నాయి. మొన్న మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. బ్లాక్‌‌‌‌ 7లోని 11 పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు అన్నారం (సరస్వతి) బ్యారేజీ పిల్లర్ల వద్ద కొత్తగా మరో బుంగ పడి.. కింద నుంచి భారీగా నీళ్లు లీక్‌‌‌‌ అవుతున్నాయి. వాటర్‌‌‌‌ లీకేజీలను అరికట్టలేక ఇంజినీర్లు చేతులెత్తేశారు. గతంలోనూ బుంగలు పడ్డాయి. ప్రస్తుతం పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోయి వాటర్‌‌‌‌ లీకవుతున్నది. 


దీంతో విషయాన్ని నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) దృష్టికి ఇక్కడి అధికారులు తీసుకెళ్లారు. ముందుగా స్టోరేజీ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఎన్డీఎస్​ఏ ఆదేశించింది. దీంతో ఇంజినీర్లు శుక్రవారం రాత్రికి రాత్రే గేట్లు తెరిచి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ముందుగా 2 గేట్లు తెరిచిన ఇంజినీర్లు.. శనివారం సాయంత్రానికి 10 గేట్లు తెరిచి 6 వేల క్యుసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. 

అన్నారం బ్యారేజీ పిల్లర్ల కింద నుంచి భారీగా వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీ  కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని అన్నారం గ్రామ సమీపంలో గోదావరి నదిపై రూ.2.228 కోట్లతో అన్నారం(సరస్వతి) బ్యారేజీని నిర్మించారు. ఆఫ్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ పనులు చేపట్టింది. 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1,250 మీటర్ల పొడవునా 66 గేట్లతో బ్యారేజీ నిర్మించారు. 2019 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యారేజీని స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నీటిని కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్​‌‌‌‌‌‌‌‌ దగ్గర మోటార్లను స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా అన్నారం బ్యారేజీకి రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేస్తారు. అన్నారం బ్యారేజీ నీటిని రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలోకి పంపిస్తారు. అయితే బ్యారేజీ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన కొద్ది నెలలకే పిల్లర్ల కింద బుంగలు పడి లీకవడం స్టార్టయింది. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ గ్రౌటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం ద్వారా బుంగలు పూడ్చుకుంటూ వస్తున్నది. గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగిన నాలుగు రోజుల తర్వాత అన్నారం బ్యారేజీలో కూడా పిల్లర్ల  కింద ఇలా పది చోట్ల బుంగలు పడిన విషయం బయటికొచ్చింది. కెమికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గ్రౌటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి బుంగలను పూడ్చినట్లుగా ఇంజినీర్లు ప్రకటించారు. తీరా శుక్రవారం 34వ పిల్లర్​ కింద నుంచి భారీగా వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీ అవడం స్టార్టయింది.  సేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7 పరిధిలో 19, 20, 21వ పిల్లర్ల  దగ్గర ఎట్లయితే భూ అంతర్భాగం నుంచి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకై వస్తుందో.. అచ్చం అలాగే అన్నారంలో కూడా స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. లీకేజీ అరికట్టడానికి లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉండటం వల్ల కెమికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గ్రౌటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం వారికి సాధ్యం కాలేదు. 

ఇసుక మీద చేసిన నిర్మాణాలు.. కొట్టుకుపోతున్న బ్యారేజీలు 

సర్కారు ఇంజినీర్లు నదిపై బ్యారేజీ కట్టేటప్పుడు నది అడుగున రాయి ఎంత లోతులో ఉందో చూసి అక్కడ నుంచి బ్యారేజీ పునాదులు కడతారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా గోదావరి నదిపై కట్టిన మేడిగడ్డ(లక్ష్మీ), అన్నారం(సరస్వతి), సుందిళ్ల(పార్వతి) బ్యారేజీ పునాదులను సర్కారు ఇంజినీర్లు ఇసుకపైనే నిర్మించారు. ఖర్చు తగ్గిస్తున్నామనే పేరుతో తమ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైపుణ్యాలను కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యారేజీలపై చూపించారు. ఇక్కడ నదిలో రాయి చాలా లోతులో ఉండగా.. అంత లోతు నుంచి కాంక్రీట్ తో కూడిన కట్టడం కట్టాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి, ఖర్చు తగ్గించాలనే భావనతో ఇసుక పైనే శ్లాబ్ ను నిర్మించారు. ఈ స్లాబ్ ను రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని పిలుస్తారని చెప్పారు. ఆ శ్లాబ్ పైనే పియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పిల్లర్లు) వేసి గేట్లు అమర్చి బ్యారేజీలను కట్టారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 86 పిల్లర్లు నిర్మించగా, అన్నారం బ్యారేజీలో 67 పిల్లర్లు నిర్మించారు. వీటన్నింటిని బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వారీగా విభజించి కట్టారు. ఇసుకపై శ్లాబ్ వేస్తే, వరద వచ్చినప్పుడు కింద ఉన్న ఇసుక కొట్టుకు పోతే ఎట్లా? అని భావించి ఇసుక కొట్టుకుపోకుండా కట్-ఆఫ్ -వాల్ నిర్మాణం చేసినట్లుగా ఇంజినీర్లు చెప్పారు. ఇసుక కొట్టుకుపోకుండా శ్లాబ్ కు రెండు వైపులా, మొత్తం నది ఎంత వెడల్పు ఉందో అంత వరకూ అడ్డంగా,  కొంత లోతు వరకూ నిట్టనిలువుగా కాంక్రీటు గోడ లాంటి (కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నిర్మాణాన్ని చేపట్టామని సర్కారు ఇంజినీర్లు ప్రకటించారు. ఈ కాంక్రీట్ గోడ పై నుంచి వచ్చే నీటిని శ్లాబ్ కింద నుంచి వేగంగా ప్రవహించకుండా అడ్డుకుంటుందని వివరించారు. దీంతో శ్లాబ్ కింద ఉన్న ఇసుక 
కొట్టుకుపోదని ఆనాడు చెప్పారు. ఇప్పుడేమో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు‌‌‌‌‌‌‌‌ భూమిలోకి కుంగిపోవడం, అన్నారం బ్యారేజీలోని పిల్లర్ల  కింద నుంచి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీ కావడం వెనుక రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం కారణమని ప్రభుత్వ ఇంజినీర్లు ప్రకటించారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ఆఫీసర్లు సైతం గత అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలలో ఈ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పరిశీలించినప్పుడు వీటి డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిర్మాణం, నిర్వహణ  లోపం వల్లనే ఇవి భూమిలోకి కుంగుతున్నాయని ప్రకటించారు. ఈ బ్యారేజీలలో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోవడం ఖాయమని తేల్చారు.

స్టోరేజీ వాటర్​ బయటకు..

అన్నారం బ్యారేజీ 38వ పిల్లర్​ కింద నుంచి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీ అవుతున్న విషయాన్ని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు వెంటనే నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు అక్కడి పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు భూమిలోకి కుంగిన సమయంలో తాము ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీకి వచ్చినప్పుడే మేడిగడ్డతో పాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ లేకుండా చేయాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు అన్నారంలో 8 టీఎంసీల నీళ్లు ఉంటే 6 టీఎంసీలు ఒదిలేసి 2 టీఎంసీల నీళ్లు ఎందుకు స్టోరేజీ చేశారని అథారిటీ అధికారులు ప్రశ్నించారు. వెంటనే స్టోరేజీ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీకి గల కారణాలు తెలుసుకోవడానికి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయాలని ఆదేశించారు. 34వ పిల్లర్​ కింద నుంచి భారీగా వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీ అవుతుండటం, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ఆదేశాల నేపథ్యంలో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఇంజినీర్లు శుక్రవారం రాత్రికి రాత్రే 2 గేట్లు తెరిచి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వదిలేశారు. శనివారం మధ్యాహ్నానికి 10 గేట్లు తెరిచి 6,750 వేల క్యుసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీలు బయటికి కనిపించకుండా పక్కన ఉన్న  అన్నీ గేట్లను తెరిచి పెట్టారు.