టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ వస్తే ఎలా చెలరేగుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో పరుగుల వరద పారించే కోహ్లీ.. ఐపీఎల్ లోనూ ఆ ఫా ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడుతున్నాడు. 2008 తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేలంలోకి రాలేదు. ఒకవేళ కోహ్లీ ఐపీఎల్ వేలంలోకి వస్తే ఎంత ధర పలుకుతాడో ఊహించడమే కష్టం. తాజాగా ఐపీఎల్ 2025 వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మిడెస్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read:-బోర్డర్ గవాస్కర్‌కు బిగ్ ప్లాన్.. దేశవాళీ క్రికెట్ ఆడనున్న ఆస్ట్రేలియా కెప్టెన్
కోహ్లీ ఐపీఎల్ వేలంలోకి వస్తే కచ్చితంగా రూ. 30 కోట్లు పలుకుతాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇతను చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం కోహ్లీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 15 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. వేరే ఫ్రాంచైజీ మారే అవకాశం ఉన్నా కోహ్లీ మాత్రం ఆర్సీబీ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో కోహ్లీ 15 మ్యాచ్ ల్లో 744 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు. అయితే ప్రతిసారి కోహ్లీ వ్యక్తిగతంగా రాణిస్తున్నా జట్టుగా విఫమలమవుతుంది.
2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. కోహ్లీ వేలంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరో నాలుగు లేదా ఐదేళ్లు ఈజీగా ఐపీఎల్ లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కోహ్లీని రిటైన్ చేసుకోవడం ఖాయం. ఐపీఎల్ 2025.. నిర్వహణ కోసం ఇప్పటి నుంచే బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేలంలో అనుసరించాల్సిన నిబంధలు, వాటిల్లో ఏమైనా మార్పులు చేయాలా? అని ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.