హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి పంపించారు. ఆయనతో పాటు మున్సిపాలిటిలోని పదో వార్డు కౌన్సిలర్ గుండా ఫణి కుమారి రాజీనామా చేశారు.
వీరిద్దరూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున, గుండా రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.