ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఆడియన్స్ కూడా కొత్త కొత్త కంటెంట్ కోసం ఓటీటీలనే నమ్ముకుంటున్నారు. ఓటీటీ సంస్థలు కూడా వారవారం సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షోలు ఇలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగానే మరి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో సిదంగా ఉంది సోనీ లివ్.
మహారాణి పేరుతో సరికొత్త వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్
అండ్ థ్రిల్లర్ సిరీస్ మార్చ్ 7 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విజయంతంగా రెండు సీజన్ లో కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బీహార్‌లోని హానికరమైన మద్యం వ్యాపారం బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సిరీస్ కు సుభాష్ కపూర్ కథ అందించగా.. కరణ్ శర్మ దర్శకత్వం వహించారు, కాంగ్రా టాకీస్ పతాకంపై డింపుల్ ఖర్బందా, నరేన్ కుమార్ నిర్మించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సిరీస్ హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. అయినప్పటికి సబ్ టైటిల్స్ తో చూసేయొచ్చు. వీలుంటే మీరు కూడా చూసేయండి.