మనుషుల బోన్స్​ ఫేస్‌‌‌‌బుక్‌‌లో సేల్.. పర్మిషన్‌‌‌‌ లేకుండా అమ్ముతున్న యూఎస్‌‌‌‌ మహిళ అరెస్ట్

మనుషుల బోన్స్​ ఫేస్‌‌‌‌బుక్‌‌లో సేల్.. పర్మిషన్‌‌‌‌ లేకుండా అమ్ముతున్న యూఎస్‌‌‌‌ మహిళ అరెస్ట్

ఫ్లోరిడా: అమెరికాకు చెందిన ఓ మహిళ మనుషుల ఎముకలను ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో పెట్టి మరీ సేల్ చేస్తున్నారు. పక్కటెముకలు, పుర్రెలు, వెన్నుపూస ఇతరత్రా బోన్స్‌‌‌‌ అన్నింటినీ ఫ్లోరిడాలో అమ్మకానికి పెట్టారు. ఇది ఇల్లీగల్‌‌‌‌ అంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లోరిడాకు చెందిన 52 ఏండ్ల మహిళ కింబర్లీ షాపర్‌‌‌‌‌‌‌‌.. ఆరెంజ్‌‌‌‌ సిటీలో విక్‌‌‌‌డ్ వండర్‌‌‌‌‌‌‌‌ల్యాండ్ పేరుతో ఓ షాప్‌‌‌‌ నడిపిస్తున్నారు. 

సేకరించిన మనుషుల ఎముకలను ఆ షాప్‌‌‌‌లో ఉంచి, ఫేస్‌‌‌‌బుక్ మార్కెట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ ద్వారా అమ్మకాలు మొదలుపెట్టారు. దీనిని పోలీసులు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. పుర్రెలు, కీళ్లు, వెన్ను ఎముకలు, రిబ్స్ వంటివి స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ మెడికల్ టెస్ట్‌‌‌‌కు పంపించగా, కొన్ని ఎముకలు వంద ఏండ్ల కిందటివని, మరో ఎముక 500 ఏండ్ల నాటిదని తేలిందని చెప్పారు. 

అయితే, ఇవన్నీ మెడికల్ స్టూడెంట్ల ఎడ్యుకేషన్‌‌‌‌ పర్పస్‌‌‌‌కోసం తాము చాలా ఏండ్లుగా విక్రయిస్తున్నట్లు కింబర్లీ షాపర్ చెప్పుకొచ్చారు. వాటన్నింటినీ ప్రైవేటు అమ్మకందారుల నుంచి కొనుగోలు చేశామని వివరించారు. ఫ్లోరిడాలో ఇలాంటి అమ్మకాలు చట్టవిరుద్ధం అనే సంగతి తమకు తెలియదని పేర్కొన్నారు.