వామ్మో: కరోనా మళ్ళీ దాపురించింది..కోల్కతాలో మహిళకు హెచ్కేయూ1 వైరస్.. లక్షణాలు ఇవే..

వామ్మో: కరోనా మళ్ళీ దాపురించింది..కోల్కతాలో మహిళకు హెచ్కేయూ1 వైరస్.. లక్షణాలు ఇవే..

యావత్ ప్రపంచాన్ని రెండు, మూడేళ్ళ పాటు గడగడలాడించిన కరోనా వైరస్ పీడకల నుంచి కోలుకొని మళ్ళీ మాములు జీవితం గడుపుతున్నారు జనం.. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో మళ్ళీ దాపురించింది కరోనా మహమ్మారి. ఈసారి హ్యూమన్ కరోనా ( హెచ్ కేయూ1 ) రూపంలో ప్రత్యక్షమయ్యింది మహమ్మారి. కోల్కతాలో ఓ మహిళకు హ్యూమన్ కరోనా వైరస్ సోకినట్లు నిర్దారించారు డాక్టర్లు. సోమవారం ( మార్చి 17 ) కోల్కతాలో 45ఏళ్ళ మహిళకు హ్యూమన్ కరోనా వైరస్ సోకినట్లు నిర్దారించారు డాక్టర్లు.

గత 15రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న మహిళకు టెస్టులు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం సౌత్ కోల్కతాలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్లు.

హ్యూమన్ కరోనా లక్షణాలు:

  • తలనొప్పి
  • జ్వరం
  • దగ్గు
  • ముక్కు కారటం
  • గొంతు నొప్పి
  • లక్షణాలు తీవ్రమైతే న్యుమోనియా, బ్రాంకైటీస్ కు దారి తీసే ప్రమాదం ఉందని తెలిపారు డాక్టర్లు.

హ్యూమన్ కరోనా కార్డియోపల్మోనరీ వ్యాధి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్దులు, గర్భిణి స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు డాక్టర్లు.

నివారణ చర్యలు: 

  • కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలే హ్యూమన్ కరోనా విషయంలో కూడా తీసుకోవాలని తెలిపారు డాక్టర్లు. 
  • చేతులను శుభ్రంగా ఉందుకోవడం
  • పదే పదే చేతులతో చెవి, ముక్కు నోటిని తాకకుండా ఉండడం
  • అనారోగ్యంగా అనిపిస్తే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం
  • సామజిక దూరం పాటించడం
  • దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు మూసుకోవడం
  • పరిసరాలు, వస్తువులు శుభ్రంగా ఉందుకోవడం 

హ్యూమన్ కరోనా లక్షణాలకు వ్యాక్సిన్ లేనప్పటికీ.. భయపడాల్సిన అవసరం లేదని, ఈ లక్షణాల నుంచి చాలామంది స్వయంగా కోలుకుంటారని అంటున్నారు డాక్టర్లు. ఎక్కువగా పండ్ల రసాలు, నీళ్లు తాగడం, అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే హ్యూమన్ కరోనా వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు.