సంచారులకు మంచి రోజులు?

సంచారులకు  మంచి రోజులు?

ఏటా బడ్జెట్​లో వేల కోట్ల రూపాయలు వెల్​ఫేర్​కోసం ఖర్చు చేస్తున్నాం. కానీ, సంచార జాతులకు ఇప్పటికీ సంక్షేమ ఫలాలు అందడం లేదు. ఈ జాతులకు మొదటి నుంచీ అన్యాయమే జరుగుతోంది. వీరు ఊరూరా తిరుగుతూ ఇండిపెండెన్స్​ పోరాటాన్ని ప్రచారం చేస్తున్నారన్న భయంతో బ్రిటిష్​ పాలకులు 1871 సంవత్సరంలో వీరిని ‘క్రిమినల్​ ట్రైబ్స్​ (నేరస్త జాతులు)’గా నోటిఫై చేశారు. స్వాతంత్ర్యం తర్వాత 1952లో సరిగ్గా ఇదే రోజున (ఆగస్టు 31న) తిరిగి డీనోటిఫై జరిగింది. వెల్ఫేర్​ స్కీమ్​లకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ  అభివృద్ధికి నోచుకోవడం లేదు నేటి సంచార జాతులు.

ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రయత్నం చేశారనే చెప్పాలి. వారి సమస్యలను గుర్తించడానికి 2015లో  సంచార జాతులకే చెందిన సోషల్​ యాక్టివిస్ట్​ భీకూ రాంజీ ఇదాతే నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటయ్యింది. ఇది దేశవ్యాప్తంగా పర్యటించి 2017లో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది.

ఇదాతే కమిషన్ సూచనలు:

శాశ్వత ప్రాతిపదికన జాతీయ సంచార జాతుల కమిషన్​ ఏర్పాటు

సంచార జాతుల జనాభా ఎక్కువగాగల  రాష్ట్రాలలో ప్రత్యేక సంక్షేమ శాఖ

సంచార జాతులకు రిజర్వేషన్ల కల్పన

2011 జనాభా లెక్కల ఆధారంగా సంచార జాతుల జనాభా ప్రకటన. ఇకపై జరగబోయే ఎన్యూమరేషన్​లో కులాలవారీగా జాతుల సమాచార సేకరణ

రాజ్యసభకు, శాసనమండలికి కనీసం ఒక్కొక్కరినైనా సంచార జాతుల నుంచి నామినేట్

అట్రాసిటీస్​ చట్టం సంచార జాతులకు వర్తింపు

సంచార జాతులకు ప్రత్యేక సబ్​కోటా

సంచార జాతులకు ఒకే కేస్ట్​ సర్టిఫికేట్​ (ఉదా : ఎస్సీ–డిఎన్టీ / ఎస్టీ–డీఎన్డీ / ఓబిసీ–డీఎన్టీ)

సంచార జాతుల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంటు

విద్యా రంగంలో ప్రత్యేక కార్యక్రమాలు

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి