ఉత్తరప్రదేశ్‌లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ (కేఈఐటీ) విద్యార్థులు డంపింగ్ యార్డ్ నుంచి సేకరించిన పలు రకాల తుక్కు సామగ్రిని ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ఏకంగా హ్యూమనాయిడ్ రోబోను రూపొందించారు. ఆ రోబోకు అనుష్క అని పేరు పెట్టారు.వేద సూత్రాల ప్రేరణతో దీని ఇంటెలిజెన్స్ వ్యవస్థను, త్రీడీ ప్రింటెడ్ భాగాలతో ఫేషియల్ ఫీచర్స్‌ను తీర్చిదిద్దారు. భారత్‌లోని మేడమ్ టుస్సాడ్స్ బృందం రూపొందించిన ఫ్లెక్సిబుల్ సిలికాన్ స్కిన్‌ను తొడిగారు.
ప్రపంచంలో కొట్టుకునే గుండెను కలిగి ఉన్న తొలి రోబో ఇది. కేవలం రూ.2లక్షల ఖర్చుతో దీన్ని తయారు చేశారు. ఇతర మాడళ్ల హ్యూమనాయిడ్ రోబోల తయారీ ఖర్చు కంటే ఇది చాలా తక్కువ.ఓపెన్ ఏఐ డేటాబేస్ నుంచి సంగ్రహించిన సమాచారాన్ని ఉపయోగించుకుని ప్రస్తుతానికి అనుష్క 61 భాషలు, 50 రకాల హ్యాండ్ గెశ్చర్స్ ద్వారా వినియోగదారులతో కమ్యూనికేట్ చేయగలుగుతుంది.