దారి దోపిడీ కేసులో 8 మంది అరెస్టు.. నిందితుల్లో మైనర్​

దారి దోపిడీ కేసులో 8 మంది అరెస్టు.. నిందితుల్లో మైనర్​

మెహిదీపట్నం, వెలుగు: కారు ఆపి దారి దోపిడీ చేసిన 8 మందిని హూమాయున్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తన ఆఫీస్​లో ఆదివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు.  శ్రీమంత్ కుమార్​తో పాటు మరో నలుగురు స్నేహితులు శుక్రవారం అర్ధరాత్రి కారులో వస్తుండగా, పీఎస్ నగర్ లో 8 మంది ముఠా సభ్యులు కారుని ఆపి దోపిడీ చేశారు. బాధితుల నుంచి రెండు సెల్​ఫోన్లతోపాటు గోల్డ్ చైన్, రింగ్ ను దోచుకున్నారు. 

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హుమాయున్ నగర్ పోలీసులు ఆదివారం నిందితులను పట్టుకున్నారు. మహమ్మద్ ఇజాజ్ (22), ఫరుద్దీన్ ఖాన్ (21), నీరటి ప్రశాంత్ (22), కాలాపూరి సాయి(22), పియాల రాజశేఖర్(26), మహమ్మద్ ఖలీల్ (22), గిమాకా అభిలాష్ (19)తో పాటు  ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహమ్మద్ ఇజాజ్ ఇప్పటికే​రాయదుర్గం పీఎస్ లో ప్రాపర్టీ కేసులో నిందితుడిగా ఉండగా, షహీన్ ఫరీదోద్దీన్ ఖాన్ పై 17 కేసులు, నిరుటి ప్రశాంత్ పై మూడు కేసులు నమోదైనట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి పూర్తి సొత్తుతోపాటు స్వాధీనం చేసుకున్నారు. మైనర్​ను జువెనల్ హోంకు తరలించారు.