
పుణె: ఇండియా గ్రాండ్ మాస్టర్లు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి.. విమెన్స్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో మరో రౌండ్‌ను డ్రాగా ముగించారు. మంగళవారం మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హారిక 116 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. ఆరంభంలో మెరుగ్గా ఆడిన తెలుగమ్మాయి మిడిల్ గేమ్‌లో తడబడింది.
అలీనా కలిన్‌స్కయా (రష్యా)తో జరిగిన గేమ్‌ను హంపి 61 ఎత్తుల వద్ద డ్రాతో ముగించింది. వైశాలి రమేశ్‌బాబు.. సలీమోవా నర్గుయెల్ (బల్గేరియా)తో జరిగిన గేమ్ 47 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఇక జు జినెర్ (చైనా)తో జరిగిన గేమ్‌లో దివ్య దేశ్‌ముఖ్ 50 ఎత్తుల వద్ద ఓటమిపాలైంది. ఈ రౌండ్ తర్వాత హంపి ఆరు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.