
పుణె: ఫిడే విమెన్స్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ ఇండియా ఎడిషన్‌లో లెజెండరీ ప్లేయర్ కోనేరు హంపి వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన నాలుగో రౌండ్‌లో రష్యా గ్రాండ్ మాస్టర్ పొలినా షువలోవాను ఓడించింది. తెల్లపావులతో ఆడిన హంపి ఆరంభం నుంచే సత్తా చాటింది. 33 ఎత్తులోనే పొలినా పని పట్టింది.
మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక.. యంగ్ ప్లేయర్ ఆర్. వైశాలి మధ్య జరిగిన గేమ్ 34 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. ఇదే రౌండ్‌లో దివ్య దేశ్‌ముఖ్ 77 ఎత్తుల్లో జార్జియాకు చెందిన మెలియాను ఓడించింది. ఐదో రౌండ్‌లో హంపితో హారిక తలపడనుంది.