అడెల్లి ఆలయానికి 28.33 లక్షల ఆదాయం

సారంగాపూర్, వెలుగు : సారంగాపూర్​ మండలంలోని ప్రసిద్ధి గాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. రూ.28 లక్షల 33 వేల 457 ఆదాయం సమకూరినట్లు ఇన్​చార్జి ఈఓ రంగు రవి కిషన్ గౌడ్ తెలిపారు.

ఈ లెక్కింపును అదిలాబాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్​స్పెక్టర్ రాజమౌళి పర్యవేక్షించగా, స్థానిక ఎస్​ఐ చంద్రమోహన్​ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ సీనియర్ అసిస్టెంట్ రమణారావు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.