యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. గత 14 రోజులుగా హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల్లో రూ.1,40,43,567 నగదు, 77 గ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండి సమకూరిందని ఈవో గీతారెడ్డి చెప్పారు. ఆలయంలో మంగళవారం నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు జరిపించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.13,98,224 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు.
యాదగిరిగుట్ట ఉద్యోగులకు ప్రమోషన్లు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో డ్యూటీ చేస్తున్న పలువురు ఉద్యోగులకు దేవాదాయ శాఖ పదోన్నతులు కల్పించింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం ఎండోమెంట్ శాఖ విడుదల చేసింది. ఆలయంలో ఏఈవోగా పనిచేస్తున్న దోర్బల భాస్కర్ శర్మకు డీఈవోగా ప్రమోషన్ లభించింది. అదేవిధంగా సూపరింటెండెంట్ గజవెల్లి రఘుకు ఏఈవోగా, సీనియర్ అసిస్టెంట్ రామారావు నాయక్ కు సూపరింటెండెంట్ గా ప్రమోషన్వచ్చింది. ఉద్యోగులకు పదోన్నతులకు సంబంధించిన నియామక పత్రాలను ఆలయ ఈవో గీతారెడ్డి అందజేశారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఎండోమెంట్ శాఖ తొలిసారి డీఈవో పోస్టును మంజూరు చేసిందని ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. ఏఈవోగా సర్వీసు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని దోర్బల భాస్కర్ శర్మకు డీఈవో(డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) గా ప్రమోషన్ ఇచ్చారని తెలిపారు.