అలంపూర్, వెలుగు : జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో సోమవారం 150 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. అమ్మవారి హుండీ ద్వారా రూ.87,02,578, స్వామి వారి హుండీ ద్వారా రూ.18,63,642, అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.38,216 తో కలిపి రూ.1,06,04,436 ఆదాయం వచ్చింది. 17- యూఎస్ డాలర్స్, 5 ఆస్ట్రేలియా కరెన్సీ, 1000 స్వీడన్ కరెన్సీ, 61 గ్రాముల మిశ్రమ బంగారం
513 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మధనేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈవో పురేందర్ కుమార్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలు జగన్మోహన్ నాయుడు, నాగ శిరోమణి, విశ్వనాథ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, గోపాల్, వెంకటేశ్వర్లు, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ పాల్గొన్నారు.