కోదండ రామాలయంలో హుండీ చోరీ

కోదండ రామాలయంలో హుండీ చోరీ

చండ్రుగొండ, వెలుగు : మండలంలోని రేపల్లెవాడ శ్రీ కోదండ రామాలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోని హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. అనంతరం గ్రామ శివారులోని పొలాల్లో హుండీని పగలగొట్టి డబ్బులు తీసుకెళ్లారు. పలు గ్రామాల్లోని ఆలయాల్లో వరుస చోరీలు జరుగుతుండడంతో పోలీసులు నిఘా పెంచాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.