భద్రాచలం,వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని హుండీలను సోమవారం లెక్కించారు. 61 రోజులకు రూ.1కోటి 7లక్షల 46వేల 530, కిలో 100 గ్రాముల వెండి, 63 గ్రాముల బంగారం వచ్చింది. 136 యూఎస్ డాలర్లు, 50 ఆస్ట్రేలియా డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీ వచ్చినట్టు ఈవో రమాదేవి తెలిపారు.
చివరిసారిగా జులై 26న హుండీలు లెక్కించినట్లుగా ఆమె వివరించారు. అలాగే సోమవారం సీతారామచంద్రస్వామికి ముత్తంగి సేవను నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు జడ్జి భీమపాక నగేశ్ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.