Cricket World Cup 2023: న్యూజిల్యాండ్ జట్టులో సెంచరీ కొట్టిన భారతీయుడు

Cricket World Cup  2023: న్యూజిల్యాండ్ జట్టులో సెంచరీ కొట్టిన భారతీయుడు

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ ప్లేయర్ సత్తా చాటాడు. అదేంటి ఇండియాకు మ్యాచ్ ఆదివారమైతే ఈ రోజు సెంచరీ చేయడమేంటి అనుకుంటున్నారా..? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇండియా తరపున మ్యాచు ఆడకున్నా అతడు ఒక భారతీయుడు. అతడెవరో కాదు న్యూజిలాండ్ స్పిన్ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర.

 
రచీన్ రవీంద్ర అంటే ప్రపంచ క్రికెట్ కి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచులో ఒక్కసారి ట్రెండింగ్ లో నిలిచాడు. ఇంగ్లీష్ బౌలర్లని ఒక ఆటాడుకుంటూ కేవలం 83 బంతుల్లోనే సెంచరీ చేసాడు. రవీంద్ర సెంచరీలో నాలుగు సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. రాచీన్ రవీంద్ర న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నా.. ఇతడి జన్మ స్థలం బెంగళూరు. బెంగళూరు లో క్లబ్ లెవల్ క్రికెట్ కూడా ఆడాడు.

రచీన్ నాన్న పేరు రవి కృష్ణ మూర్తి. ఇతనొక సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్. భారత నుంచి న్యూజిలాండ్ వలసవెళ్లిన వీరి కుటుంబం అక్కడే స్థిరపడ్డారు. క్రికెట్ మీద ఆసక్తితో రచీన్ రవీంద్ర బాగా ఆడి  న్యూజీలాండ్ జాతీయ జట్టులో సెలక్ట్ అయ్యాడు. తాజాగా భారత గడ్డపై న్యూజి లాండ్ తరపున సెంచరీ చేసాడు. రవీంద్రాకి తోడు ఓపెనర్ కాన్వే కూడా సెంచరీ చేయడంతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.