బిందెలతో మహిళల రాస్తారోకో
వంద సంవత్సరాల క్రితం ప్రభుత్వం తవ్వించిన బావిని పూడ్చవద్దని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెనుగువాడలో మహిళలు బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి నుంచి ధర్మారం వైపు డబుల్ రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారు. ఇందుకు బావి అడ్డంగా ఉందని పూడ్చడానికి సోమవారం ఆర్అండ్ బీ అధికారులు సిద్ధమయ్యారు. దీంతో తెనుగువాడకు చెందిన మహిళలు బిందెలతో సహా హైవేపై బైఠాయించారు. దాదాపు రెండు గంటల వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పెద్దపల్లి పోలీసులు మహిళలను సముదాయించారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని చెప్పడంతో శాంతించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు వందేళ్ల క్రితం ప్రభుత్వం ఈ బావిని తవ్వించిందని, ఇలాంటివి పెద్దపల్లి పట్టణంలో రెండు ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఎక్కువ మంది ప్రజలు ఈ బావుల నీళ్లే తాగుతున్నారన్నారు. అలాంటి బావిని పూడిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
- పెద్దపల్లి, వెలుగు
- నెల నుంచి ఉపాధి లేదు.. ఆదుకోండి
- మున్సిపల్ ఆఫీస్ ముందు కూరగాయ వ్యాపారుల ఆందోళన
స్థానిక పాత మార్కెట్ లో కూరగాయలు అమ్ముకుని జీవించే తమను మున్సిపల్ అధికారులు బలవంతంగా పాత వ్యవసాయ మార్కెట్ లో నిర్మించిన రైతుబజార్ కు తరలించారని, దీంతో నెల రోజులుగా ఉపాధి కోల్పోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జమ్మికుంట మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి నరేశ్ఆధ్వర్యంలో బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం కమిషనర్ సమ్మయ్యతో మాట్లాడి వినతిపత్రం సమర్పించారు. రైతు బజార్ ప్రాంగణాన్ని మున్సిపల్ అధికారులు తమ అధీనంలోకి తీసుకోవాలని, కూరగాయలు అమ్ముకునేవారికి ఎలాంటి రుసుములు లేకుండా అవకాశం కల్పించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. పాత మార్కెట్ ఖాళీ స్థలంలో కూరగాయలు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిరు వ్యాపారులు నర్సింహ, భరత్, రాజు తదితరులు ఉన్నారు.
- జమ్మికుంట, వెలుగు
షాదీఖానాపై ఎమ్మెల్యేది కపట ప్రేమ
చెవిలో పువ్వులతో ముస్లింల నిరసన
మెట్ పల్లి, వెలుగు : షాదీఖానా నిర్మిస్తామని చెబుతూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కాలయాపన చేస్తున్నారని, తమపై కపటప్రేమ చూపిస్తున్నారని మెట్పల్లి ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం షాదీఖానా నిర్మాణ స్థలంలో చెవిలో పువ్వులు పెట్టుకుని సుల్తాన్ పురా యూత్ అధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సహకారంతో పట్టణంలోని బీడీ కాలనీలో షాదీఖానాకు 20 గుంటల భూమిని కేటాయించిట్లు తెలిపారు. అనంతరం ధర్నాలు, రాస్తారోకో చేయడంతో 2021లో తొలిసారి, 1 ఏప్రిల్ 2022న రెండోసారి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు షాదీఖానా నిర్మాణానికి భూమిపూజ చేపట్టారన్నారు. అయినా ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని లేకపోతే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిరసనలో సుల్తాన్ పుర యూత్ లీడర్లు ఖుత్బుద్దీన్తదితరులు పాల్గొన్నారు.
చెవిలో పువ్వులతో ముస్లింల నిరసన
మెట్ పల్లి, వెలుగు : షాదీఖానా నిర్మిస్తామని చెబుతూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కాలయాపన చేస్తున్నారని, తమపై కపటప్రేమ చూపిస్తున్నారని మెట్పల్లి ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం షాదీఖానా నిర్మాణ స్థలంలో చెవిలో పువ్వులు పెట్టుకుని సుల్తాన్ పురా యూత్ అధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సహకారంతో పట్టణంలోని బీడీ కాలనీలో షాదీఖానాకు 20 గుంటల భూమిని కేటాయించిట్లు తెలిపారు. అనంతరం ధర్నాలు, రాస్తారోకో చేయడంతో 2021లో తొలిసారి, 1 ఏప్రిల్ 2022న రెండోసారి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు షాదీఖానా నిర్మాణానికి భూమిపూజ చేపట్టారన్నారు. అయినా ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని లేకపోతే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిరసనలో సుల్తాన్ పుర యూత్ లీడర్లు ఖుత్బుద్దీన్తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ మెస్ సప్లయర్ కు షోకాజ్ నోటీస్
కరీంనగర్, వెలుగు: స్థానిక రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ లో స్టూడెంట్లకు మీల్స్ సప్లై చేసే హైదరాబాద్ కు చెందిన స్నేహ క్యాటర్స్ కు డీవైఎస్ ఓ రాజ్ వీర్ సోమవారం షోకాజ్ నోటీస్ అందించారు. ఇటీవల స్పోర్ట్స్ స్కూల్ లో భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదని, డైట్ నిర్వహణ సరిగా లేదని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఆయన షోకాజ్ నోటీస్ లు ఇచ్చారు. కాగా ఇక్కడ మీల్స్ సప్లై చేస్తున్నట్లు హైదరాబాద్ కు చెందిన స్నేహ క్యాటర్స్ పేరు ఉందేకానీ.. నిజానికి ఫీల్డ్ లో సప్లై చేసేది మాత్రం లోకల్ కు చెందిన మెస్ కాంట్రాక్టరే. అది కూడా హాస్టల్ స్టూడెంట్లకు వండి పెట్టడం లేదు. కేవలం అన్నం మాత్రమే ఇక్కడ వండి మిగిలిన కూరలు, ఇతరత్రా సరుకులు బయట వండి తెస్తున్నారు. కాగా స్నేహ క్యాటర్స్ స్టూడెంట్స్ కు మీల్స్ సప్లై చేయని విషయం అధికారులకు తెలుసని, వారు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
నిధులు ఇస్తామన్నా పనులు చేస్తలేరు
తిమ్మాపూర్, వెలుగు: గ్రామాల్లో సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలతోపాటు వివిధ పనుల కోసం నిధులు ఇస్తామన్నా.. ప్రజాప్రతినిధులు ఎవరూ పనులు చేయడంలేదని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని మండల పరిషత్ ఆఫీస్‌లో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మానకొండూరు మండల కేంద్రంలో 20 శాతం పనులు పూర్తయ్యాయని, అని మరో 20 శాతం పనులు చేయడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైస్ ఎంపీపీ సర్పంచ్ మధ్య వార్మండలంలోని రేణిగుంట గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తే స్థానిక సర్పంచ్ బోయిని కొమురయ్య తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి ఎమ్మెల్యే రసమయి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ఎలాంటి పనులు చేపట్టకపోవడం వల్ల రూ.55 లక్షల నిధులు సర్పంచ్ నిర్లక్ష్యంతో వృథా అయ్యాయని తెలిపారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రసమయి గ్రామాల అభివృద్ధిలో కలిసి పని చేసుకోవాలని సర్పంచ్‌కు హితవు పలికారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ విజయ, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్కూల్‌ను తనిఖీ చేసిన సివిల్ జడ్జి
తిమ్మాపూర్, వెలుగు: మండలంలోని రామకృష్ణ కాలనీ మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ పాఠశాలను జిల్లా సీనియర్ సివిల్ సెక్రటరీ సుజయ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమయానికిభోజనం, టిఫిన్ అందజేస్తున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికను తనిఖీ చేసి విద్యార్థులకు తరగతి గదులు హాస్టల్ బెడ్స్ ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలను ఆహార పదార్థాలను పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
మెట్ పల్లి, వెలుగు : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన మెట్ పల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితురాలు బొమ్మిడి రజిత కథనం ప్రకారం.. మెట్ పల్లి మండలం మసాయిపేటకు చెందిన రజిత భర్త రత్నాకర్ గల్ఫ్ కు వెళ్ళడంతో ఆరేళ్లుగా పిల్లల చదువు కోసం రజిత మెట్ పల్లి పట్టణం హనుమాన్ నగర్ లో కిరాయి ఇంట్లో ఉంటోంది. పిల్లలకు రెండు రోజులు హాలిడేస్ ఉండడంతో ఇంటికి తాళం వేసి చెల్లి ఇంటికి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కు వెళ్లింది. సోమవారం ఉదయం వచ్చి చూడగా బీరువా ఓపెన్‌చేసి ఉంది. దీంతో రజిత పోలీసులకు సమాచారం ఇచ్చింది. బీరువాలో దాచిన 4 తులాల బంగారు చైన్లు, రూ.26 వేల నగదు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపింది. రజిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పేదలు బలపడేందుకే అభివృద్ధి పథకాలు
113 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
కరీంనగర్ సిటీ, వెలుగు: పేదలు ఆర్థికంగా బలపడేందుకే ప్రభుత్వం అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందని బీసీ సంక్షేమ, పౌరసంఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ రూరల్, అర్బన్, కొత్తపల్లి మండలాలకు చెందిన 113 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిని భారంగా భావించకుండా సీఎం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, కొత్తపళ్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు ఎంపీపీ లక్ష్మయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు.
దసరా లోపు నివేశన స్థలాలు
కరీంనగర్: పట్టణంలోని జర్నలిస్టులకు దసరా లోపు నివేశన స్థలాలు అందిస్తామని మంత్రి కమలాకర్ అన్నారు. టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ నూతన కమిటీ సభ్యులు సోమవారం మీసేవ ఆఫీసులో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ జర్నలిస్టులకు నివేశన స్థలాల పంపిణీ పై రెండు రోజుల్లో జర్నలిస్టు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం
కొత్తపల్లి: గ్రామాల్లో సమస్యలు లేకుండా తీర్చిదిద్దుకుందామని మంత్రి కమలాకర్ అన్నారు. కొత్తపల్లి ఎంపీపీ శ్రీలత అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్య, మిషన్ భగీరథ, హార్టికల్చర్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఈజీఎస్, నీటి పారుదల, రెవెన్యూ, విద్యుత్ శాఖ తదితర అంశాలపై చర్చించారు. కాగా సమావేశానికి అధికారులు గైర్హాజరవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎ.శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ కరుణశ్రీ, ఏఎంసీ చైర్మన్మధు, తహశీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధిలో కేంద్రం నిధులు
తిమ్మాపూర్, వెలుగు: గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులున్నాయని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ సారథ్యంలో అమలుచేస్తున్న పథకాలను ప్రతీ గ్రామంలో ప్రజలకు వివరించాలన్నారు. కాగా ప్రవీణ్ రావును, మానకొండూర్ బీజేపీ కన్వీనర్ జగన్ రెడ్డిను, కో కన్వీనర్ బత్తిని స్వామిని మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, గన్నేరువరం, బెజ్జెంకి మండలాల అధ్యక్షులు జగదీశ్వరాచారి, ప్రవీణ్, ఐలయ్య, శంకర్, అశోక్, జిల్లా కార్యవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నియోజకవర్గకన్వీనర్గా శ్రవణ్
గంగాధర, వెలుగు : బీజేపీ చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్‌గా గంగాధర మాజీ ఎంపీటీసీ సభ్యుడు పెరుక శ్రవణ్‌కుమార్ ను నియమిస్తూ బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కుమార్ ఆదేశాల మేరకు నియామకం జరిగిందని, నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషిచేయాలని ఆయన పేర్కొన్నారు.