హైదరాబాద్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ దందా జోరుగా సాగుతోంది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసి అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. డక్కన్ ట్రేడర్స్ పేరుతో ఉప్పర్ పల్లిలో కల్తీ జింజర్ పేస్ట్ తయారు చేస్తుంది ముఠా. బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డ కేంద్రంగా స్టోర్ చేసి అమ్ముతున్నారు. ఈ దందా చేస్తు్న్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.. వీరి నుంచి 700 కిలోల కల్తీ పేస్ట్, 625 కేజీల నాసిరకం వెల్లుల్లి, 100 కిలోల నాసిరకం అల్లం, కెమికల్స్ ను సీజ్ చేశారు. పట్టుబడిన ఈ కల్తీ జింజర్ పేస్ట్ విలువ ఐదు లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు.
బేగంబజారులోని రెండు దుకాణాలపై కూడా పోలీసులు దాడులు చేశారు. పెద్ద మొత్తంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లభ్యమైంది. నిందితులు పాటిగడ్డకు చెందిన పాండు రంగారావు, డెక్కన్ ట్రేడర్స్ యజమాని రహీం, అజయ్ కుమార్, అహీర్, తెలంగాణ ఏజెన్సీ యాజమాన్యం ప్రదీప్ సంక్లా , నిఖిల్ ట్రేడర్స్ యజమానిగా గుర్తించారు. నిందితులు నగరంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ల తయారీ చేసి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కల్తీ బిజినెస్ లో ప్రధాన నిందితుడు గుజరాత్ కు చెందిన రహీం చరణీయ ఉప్పర్ పల్లి, రాజేంద్ర నగర్ లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టులను తయారు చేసేందుకు అక్రమ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పాండు రంగారావు, అజయ్ కుమార్, అహీర్, ప్రదీప్ సంక్లా ఏజెంట్లుగా తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సాధారణ దుకాణాల్లో వీరు ఈ కల్తీ సరుకును అమ్ముతున్నట్లు గుర్తించారు.
ALSO READ :- నన్ను కావాలనే బయటికి గెంటేశారు - గొల్లపల్లి..!
కల్తీ పేస్ట్ తిన్నట్లయితే వాటిలో రసాయనాలు, విషపూరిత పదార్థాలు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. నిందితులపై పలు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.