- లిక్కర్ స్కామ్ చేసిన కవిత నీతులు చెప్పుడేంది?
- జగిత్యాల కార్నర్ మీటింగ్ లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
జగిత్యాల: ప్రధాని మోడీని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారా? అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ చేసిన కవిత.. చెన్నై వెళ్లి స్పీచులు ఇస్తోందని మండిపడ్డారు. ప్రగతి భవన్ లో వంద పడకలు ఏర్పాటు చేసుకున్న కేసీఆర్.. పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా కట్టడం లేదని మండిపడ్డారు. ఇవాళ జగిత్యాల జిల్లా కోరుట్ల లోని ఝాన్సీ రోడ్డు లో నిర్వహించిన ‘ప్రజా గోసా - బీజేపీ భరోసా’ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అభివృద్ధిపై మాట్లాడకుండా మోడీ గురించి ఇష్టం మొచ్చినలెట్టు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రైతుల కోసం భీమా యోజన ప్రవేశ పెట్టిందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చించకుండా మోడీ ని తిట్టుకుంటూ సభ నడిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా.. కోర్టుకు వెళ్లారని బీజేపీని బద్నాం చేస్తోందని ఫైర్ అయ్యారు.
ఓల్డ్ సిటీ వాళ్లు కరెంట్ బిల్లులు కట్టరని.. కరెంటు చార్జీలకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని సైతం కొట్టిన ఘటనలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో పోలీస్ అధికారులకు సీనియారిటీ ప్రకారం పోస్టులు లేవని, చెంచా గిరి, అర్హత లేని వారికి పోస్టులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలకు గ్రామపంచాయతీలకు కూడా మోడీ నిధులే వస్తున్నాయని చెప్పారు. కేంద్ర నిధుల పై చర్చించడానికి ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నానని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పూదరి అరుణ, తుల ఉమ , సాంబారి ప్రభాకర్, జిల్లా ప్రెసిడెంట్ పైడిపల్లి సత్యనారాయణ,సెక్రటరీ మదుకర్, శీలం వేణుగోపాల్, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జేఎన్ వెంకట్, సునీత, అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు