
పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్, పేరూర్ గ్రామాల మధ్య మంజీరా నదిలో వందలాది చనిపోయిన కోళ్లను పడేశారు. అవి కుళ్లిపోయి మంజీరా నీళ్లు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పశువులు ఈ నీటిని తాగి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, చేపలు చనిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కోళ్లు పడేసిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే మెదక్ పట్టణానికి మంచినీటిని అందించే వాటర్ ప్లాంట్ ఉంది. కోళ్లను తొలగించి, కోళ్లను పడేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.