
సాంకేతికలోపంలో చైన్నైలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. గురువారం ఉదయం రద్దీ సమయాల్లో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. దాదాపు మూడు గంటల పాలు రైళ్లు నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు ఫ్లాట్ ఫారమ్ లపై ఆందోళనకు దిగారు. తమ ఇబ్బందులను తెలుపుతూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశారు. అయితే సాంకేతిక లోపంతో మెట్రో రైళ్లు నిలిపోయాయని.. వెంటనే పునరుద్దరించామని చెన్నై మెట్రో అధికారులు ట్వీట్ చేశారు.
గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గిండి మెట్రో రైలు స్టేషన్ సమీపంలో ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ లైన్‌లో సాంకేతిక లోపం కారణంగా.. విమ్కో నగర్ డిపో , చెన్నై విమానాశ్రయం మధ్య రైలు సేవలలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు మెట్రో అధికారులు. దాదాపు మూడు గంటల తర్వాత మెట్రో సర్వీసులను పునరుద్దరించారు.
దీంతో మెట్రో ప్రయాణికులు ఆందోళనలకు గురయ్యారు.. అసౌకర్యానికి ఆగ్రహించారు. తమకు ఎంత బాధ కలిగించిందో చెబుతూ సోషల్ మీడియాకు పోస్ట్ చేశారు. అరుణ్ అశోక్ అనే ఓ ప్రయాణికుడు ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేశారు. “ దాదాపు మూడు గంటల తర్వాత ప్రయాణికులతో కిక్కిరిసన మెట్రో రైలు ఇప్పుడే బయల్దేరుతుంది. నిల్చోవడానికి అంగుళ నేల కూడా లేదు. లోపలికి వెళ్లలేకపోతున్నాం. చెన్నై మెట్రోలో ఇది పీక్ అవర్స్ ప్రీక్వెన్సీ అంటూ రాశాడు. ఇది మెట్రో రైళ్ల నిర్వహణ లోపం.. ఇది చెన్నై మెట్రో వైఫల్యం.. రెండు గంటలు లేట్ అవడంతో నేను ఫ్లైట్ మిస్సయ్యాను అంటూ కమలేష్ అనే ప్రయాణికుడు రాశాడు.