హంగేరి అధ్యక్షురాలు కాటలిన్ నోవాక్ రాజీనామా

 హంగేరి అధ్యక్షురాలు కాటలిన్ నోవాక్  తన పదవికి రాజీనామా చేశారు. పిల్లల లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న వ్యక్తికి క్షమాభిక్ష మంజూరు ప్రసాదించడంపై  ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో తాను తప్పు చేశానని అంగీకరిస్తూ  ఆమె అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు.  ఈ కేసులో ఆవేదనకు గురైన బాధితులకు  నోవాక్ క్షమాపణలు చెప్పారు.  

శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను తప్పు చేశాను. అందుకే ఇదే  అధ్యక్షురాలిగా ఇదే నా చివరి ప్రసగం. అధ్యక్షురాలి పదవికి నేను రాజీనామా చేస్తున్నా. బాధితులకు నేను సహకరించనందుకు  క్షమాపణలు. నేను చిన్న పిల్లలు, వారి కుటుంబాలకు రక్షణకు కట్టుబడి ఉంటా’ అని ఆమె వెల్లడించారు.  2022లో కటాలిన్‌ నోవాక్ హంగేరి దేశానికి తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.  

చిల్డ్రన్స్ హోమ్ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌కు క్షమాభిక్ష పెట్టడం వివాదం రేపింది.పిల్లలపై చిల్డ్రన్స్‌ హోమ్‌.. యజమాని లైంగిక వేధింపులను కప్పిపుచ్చడానికి దోషి సహాయం చేశాడని తెలుస్తోంది. దోషికి క్షమాభిక్ష నిర్ణయాన్ని గతేడాది ఏప్రిల్‌లో తీసుకున్నప్పటికీ.. గతవారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలు కాటలిన్ నోవాక్   రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఆమె తన పదవి నుంచిచ తప్పుకున్నారు.