అమెరికాలోని ఫ్లోరిడా సిటీ ఖాళీ అయ్యింది. వందేళ్ల తర్వాత నిర్మానుష్యంగా మారింది. సిటీలోని జనం ఇళ్లను వదిలేసి జార్జియా, చికాగో వంటి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీనికి కారణం మిల్టన్ తుఫాన్. ఫ్లోరిడా మీదుగా ఈ తుఫాన్ వెళుతుండటంతో.. భారీ విధ్వంసం జరగొచ్చని.. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ఆ తర్వాత అత్యంత భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ఫ్లోరిడా సిటీని వదిలి వెళ్లిపోయారు జనం.
హరికేన్ మిల్టన్ తుఫాన్ భారీ విధ్వంసాన్ని సృష్టించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. వందేళ్ల తర్వాత అంటే.. 1992లో వచ్చిన ఆండ్రూ హరికేన్ (తుఫాన్) సమయంలో భారీ నష్టం వచ్చింది. అయితే అప్పట్లో ఇంత అభివృద్ధి, జనం లేరు.. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఫ్లోరిడా సిటీ బాగా డెవలప్ అయ్యింది. ఈ క్రమంలోనే ఫ్లోరిడా సిటీని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు., హరికేన్ మిల్టన్ విధ్వంసం భారీగా ఉండొచ్చన్న హెచ్చరికల క్రమంలోనే.. లక్షల మంది జనం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు.
ALSO READ | హరికేన్ మిల్టన్ బీభత్సం.. ఫ్లోరిడాకు తుఫాను ముప్పు
ఫ్లోరిడా సిటీ వ్యాప్తంగా ఉన్న 13 వందల పెట్రోల్ బంకులు మూసి వేశారు. ఆస్పత్రులు అన్నింటినీ ఖాళీ చేశారు. మాల్స్ అన్నీ మూసేశారు. అన్ని బీచుల్లోనూ నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారు. బారికేడ్లు పెట్టారు. భారీ భవనాల్లో ఉండే వారు ముందు జాగ్రత్తగా అన్ని సిద్ధం చేసుకున్నారు. పక్కా బల్డింగ్స్ కాకుండా ఉడ్.. చెక్క ఇళ్లల్లో ఉండే అందరూ ఖాళీ చేసేశారు.
ఇక ఫ్లోరిడా సిటీలోని అన్ని మాల్స్ లో ఫుడ్ ఐటమ్స్ అన్నింటిని కొనేశారు జనం. వారం రోజులకు సరిపడా కూరగాయలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసి పెట్టుకున్నారు జనం. హరికేన్ మిల్టన్ తీరం దాటిన 48 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని అధికారుల హెచ్చరికలతో.. ఫ్లోరిడా సిటీ ఇప్పుడు లాక్ డౌన్ మాదిరిగా మారిపోయింది. హరికేన్ మిల్టన్ ఏ స్థాయిలో విధ్వంసం చేస్తుంది అనేది వెయిట్ అండ్ సీ.. ప్రస్తుతానికి అయితే తుఫాన్ ముందు ప్రశాంతతలా గంభీరంగా ఉంది ఫ్లోరిడా సిటీ..