నాడార్​.. దానాల్లో మేటి.. ఇండియాలో నంబర్​ వన్​

నాడార్​.. దానాల్లో మేటి..  ఇండియాలో నంబర్​ వన్​
  • సమాజసేవకు రూ. 2,153 కోట్లు
  • రెండో స్థానంలో ముకేశ్​ అంబానీ


ముంబై: ఐటీ కంపెనీ హెచ్​సీఎల్​ టెక్నాలజీస్ బాస్​ శివ్ నాడార్ 2023–24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక దానాలు చేసిన భారతీయ సంపన్నుడిగా నిలిచారు.   దాతృత్వంలో ఆయన  వాటా 5 శాతం పెరిగి రూ. 2,153 కోట్లకు చేరుకుంది. ఎడెల్‌‌‌‌‌‌‌‌గివ్-–హురున్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ ప్రకారం, అత్యంత సంపన్న భారతీయుడు గౌతమ్ అదానీ రూ. 330 కోట్లు,  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌కు చెందిన రెండవ అత్యంత సంపన్న భారతీయుడు ముకేశ్‌ అంబానీ ఇచ్చిన రూ. 407 కోట్ల కంటే నాడార్​దాతృత్వం చాలా ఎక్కువ.  ఈ జాబితాలో అంబానీ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానంలో నిలవగా, అదానీ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

ఆటో,  ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ వ్యాపారాల్లో ఉన్న బజాజ్ కుటుంబం 33 శాతం వృద్ధితో రూ. 352 కోట్లతో మూడు స్థానాలు ఎగబాకగా, కుమారమంగళం బిర్లా  కుటుంబం మొత్తం విరాళాల్లో రూ. 334 కోట్లతో జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఇది వార్షికంగా 17 శాతం పెరిగింది.   మొత్తం 203 మంది వ్యక్తులు రూ.5 కోట్ల కంటే ఎక్కువ విరాళాలు అందించారు. హురున్ సంపన్నుల జాబితా ప్రకారం, 1,539 మంది వ్యక్తులకు రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ నెట్​వర్త్​ ఉంది.  వారి మొత్తం సంపద సంవత్సరంలో 46 శాతం పెరిగింది.  అదానీ రూ. 11.6 లక్షల కోట్లు, అంబానీ రూ. 10.14 లక్షల కోట్లు ఉండగా, నాడార్ రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో ధనికుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.  
 
సీఎస్‌ఆర్‌‌ ​పరిమితి కంటే ఎక్కువే...

హురున్ ఇండియా వ్యవస్థాపకుడు,  ప్రధాన పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ ఈ జాబితాలోని ప్రమోటర్ల నేతృత్వంలోని తొమ్మిది కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్​ఆర్​) కోసం నిర్దేశించిన 2 శాతం మొత్తం కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చాయని వెల్లడించారు.   ఈ తొమ్మిదింటి జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 840 కోట్లకు బదులుగా రూ. 900 కోట్లు విరాళంగా ఇచ్చింది.  యార్డి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇండియా రూ. 70 లక్షలకు బదులుగా రూ. 25 కోట్లను విరాళంగా అందించింది.

మహిళల్లో  65 ఏళ్ల రోహిణి నీలేకని రూ. 154 కోట్ల విరాళాలతో దాతల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. రూ. 90 కోట్లతో సుస్మితా బాగ్చీ తర్వాతి స్థానంలో ఉన్నారు.  రోహిణి భర్త నందన్ నీలేకని, సామాజిక శ్రేయస్సు కోసం తన విరాళాలను 62 శాతం పెంచి రూ. 307 కోట్లకు చేర్చారు. దీంతో ఆయన జాబితాలో రెండు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు.  విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ విరాళం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 152 కోట్లకు పడిపోయింది. ఇది గత ఏడాది కాలంలో రూ. 1,774 కోట్లుగా ఉంది. సంపన్నులు విద్య కోసం అత్యధికంగా  రూ.3,680 కోట్లు ఇచ్చారు. తరువాతి స్థానాల్లో ఆరోగ్య సంరక్షణ (రూ. 626 కోట్లు), గ్రామీణాభివృద్ధి (రూ. 331 కోట్లు) ఉన్నాయి.