హురున్ కుబేరుల జాబితా2025..అత్యంత ధనవంతుడు అంబానీనే.. లిస్టులో కొత్తగా 13 మంది బిలియనీర్లు

హురున్ కుబేరుల జాబితా2025..అత్యంత ధనవంతుడు అంబానీనే.. లిస్టులో కొత్తగా 13 మంది బిలియనీర్లు

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. 1ట్రిలియన్ల సంపద కోల్పోయినప్పటికీ ముఖేష్ అంబానీ రూ.8.6 లక్షల కోట్ల సంపదతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. గౌతమ్ అదానీ కంటే ముఖేష్ అంబానీ ముందున్నారు. గౌతమ్ అదానీ సంపద 13శాతం పెరిగి రూ.8.4 ట్రిలియన్లకు చేరుకుంది.HCL టెక్నాలజీస్‌కు చెందిన రోష్ని నాడార్ ఐదో స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలోకి చేరిన మొదటి భారతీయ మహిళ. భారత దేశ బిలియనీర్ల లిస్టులో కొత్తగా మరో 13 మంది చేరారు. బిలియనీర్ల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.  

కొత్తగా 13మంది భారతీయ బిలియనీర్లు.. 

ఈ ఏడాది భారత్ లో 13మంది కొత్త బిలియనీర్లు చేరారు. దీంతో బిలియనీర్ల సంఖ్య 284కు చేరింది. భారత దేశ బిలియనీర్ల మొత్తం సంపద రూ. 98 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో మూడో వంతు. సౌదీ అరేబియా మొత్తం జీడీపీకంటే ఎక్కువ. ఈ 284 బిలియనీర్లలో 175 మంది సంపద ఈ ఏడాది పెరుగుదలను చూసింది.అయితే 109 మంది వారి సంపద తగ్గింది.

Also Read : రాకెట్ వేగంతో దూసుకుపోతున్న అనిల్ అంబానీ స్టాక్స్

అయితే ఇంతకుముందు ఆసియా బిలియనీర్ రాజధానిగా ఉన్న భారత్ ఆ స్థానాన్ని కోల్పోయింది. 92 మంది బిలియనీర్లతో షాంఘైనగరం ఆ బిరుదును దక్కించుకుంది. తర్వాతీ 91 మంది బిలియనీర్లతో రెండో స్థానంలో ఉండగా.. 90 మంది బిలియనీర్లతో భారత్ మూడోస్థానంలో ఉంది.  కాగా ముంబై నగరం కొత్తగా 11మంది బిలియనీర్లను తన ఖాతాలో వేసుకుంది. ఇది లండన్ (7), బీజింగ్ (8) కంటే ఎక్కువ. 

భారతదేశపు టాప్ 10 బిలియనీర్లు

  • ముఖేష్ అంబానీ-రిలయన్స్ ఇండస్ట్రీస్ - రూ. 8.6 లక్షలకోట్లు
  • గౌతమ్ అదానీ-అదానీ గ్రూప్ - రూ. 8.4 లక్షలకోట్లు
  • రోష్ని నాడార్-హెచ్‌సిఎల్ - రూ. 3.5 లక్షలకోట్లు
  • దిలీప్ షాంఘ్వీ- సన్ ఫార్మా - రూ 2.5 లక్షలకోట్లు
  • అజీమ్ ప్రేమ్‌జీ- విప్రో - రూ. 2.2 లక్షలకోట్లు
  • కుమార్ మంగళం బిర్లా- ఆదిత్య బిర్లా గ్రూప్ - రూ. 2 లక్షలకోట్లు
  • సైరస్ పూనావల్ల-సీరం ఇన్‌స్టిట్యూట్ - రూ. 2 లక్షలకోట్లు
  • నీరాజ్ బజాజ్-బజాజ్ ఆటో - రూ. 1.6 లక్షలకోట్లు
  • రవి జైపురియా- RJ కార్ప్ - రూ 1.4 లక్షలకోట్లు
  • రాధాకిషన్ దమానీ- అవెన్యూ సూపర్‌మార్ట్స్ - రూ. 1.4 లక్షలకోట్లు

టాప్ 10 బిలియనీర్లలో ఐదుగరు ముంబైలో ఉండగా.. న్యూఢిల్లీ నుంచి ఇద్దరు, బెంగళూరు, పూణె ,అహ్మదాబాద్‌లకు ఒక్కొక్కరు బిలియనీర్లు ఉన్నారు.