- రూ.1.87 కోట్లతో జల్సా
- ఐదు సెల్ ఫోన్లు, లాప్‌ట్యాప్, స్కూటీ స్వాధీనం
కారేపల్లి, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను చీట్ చేసిన భార్యభర్తలను పోలీ సులు అరెస్టుచేశారు. సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి, కారేపల్లి ఎస్సై రాజారామ్ కథనం ప్రకారం..ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని భాగ్యనగర్ తండాకు చెందిన ప్రేమ్ కుమార్, ఇతడి భార్య శోభన కలిసి గేట్ పోలంపల్లికి చెందిన బానోత్ తులసీ రామ్, ఇతడి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. శోభన తాను కేటీపీఎస్‌లో ఎంప్లాయ్అని ఐడీ కార్డు చూపించి మోసం చేసింది.
భార్యాభర్తలు కలిసి నకిలీ అపాయింట్మెంట్ఆర్డర్లు సృష్టించి నిరుద్యోగుల నుంచి రూ.1.87 కోట్లు కాజేశారు. చీటింగ్ తో వసూలు చేసిన డబ్బులను జల్సాలకు వాడుకున్నారు. ఎప్పుడూ రకరకాల కార్లలో తిరుగుతుంటాడని తెలిసింది. చాలామంది దగ్గర అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుని తిప్పించుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. తీసుకున్న డబ్బులతో కొన్న స్కూటీ, లాప్‌ట్యాప్, ఐదు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.