
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఝురాసంఘం మండలం బిడకన్నెలో పొలం దగ్గర కరెంట్ షాక్ తో భార్యాభర్తలు మృతి చెందారు. అడవి పందుల నుంచి చెరుకు పంటను కాపాడుకోవడానికి విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. అవే విద్యుత్ తీగలు తాగిలి మరియమ్మ(30), దేవపుత్ర(37) చనిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పొలం దగ్గరకు వెళ్లి మృతదేహాలను చూసి రోదించారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.