
మెదక్, వెలుగు: భార్యాభర్తల మధ్య గొడవతో భార్య శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, భర్త ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం శాలిపేట అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన భార్యాభర్తలు రాగిశెట్టి సాయికుమార్, స్రవంతి పొద్దున ఇంట్లో గొడవ పడ్డారు. మనస్తాపానికి గురైన స్రవంతి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న భర్త సాయికుమార్ (28) హవేలి ఘనపూర్ మండలం శాలిపేట సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు కొడుకులున్నారు.