భూతగాదాల్లో భార్యభర్తలను చంపేశారు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భూతగాదాలతో భార్యభర్తలపై గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. వ్యవసాయ భూముల్లో పనులు చేస్తుండగా భార్యభర్తలను గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. గత కొంతకాలంగా మృతుడి కుటుంబానికి ,అతని తమ్ముడి కుటుంబానికి మధ్య భూమి విషయంతో తగదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం (ఫిబ్రవరి 15) ఈ జంట హత్యలు జరిగినట్టు తెలుస్తోంది.. 

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఖమన గ్రామ శివారులో  ఈ జంట హత్యలు జరిగాయి. ఖమన గ్రామానికి చెందిన భార్యభర్తలు డెంగ్రె దస్రు(50), అతని భార్య బైనబాయి(40) వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటుండగా.. దస్రు తమ్ముని కుటుంబం ఒక్కసారిగా భార్యాభర్తలిద్దరిపై దాడి చేశారు. గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో దస్రు, అతని భార్య బైనబాయి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలుసేకరించారు. 

దస్రు, అతని భార్య బైనబాయిని హత్య చేసిన నిందితులు అయిన అతని తమ్ముడు కుటుంబం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.ఈ జంట హత్యలకు భూతగాదాలతో కారణంగా స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని మృత దేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.