
పెళ్లంటే..పవిత్ర బంధం అని చెబుతుంటారు. పెళ్లి అనే తంతుతో ఒక్కటైన జంటలు ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఒక్కటిగా సాగిపోయి..దశాబ్దాలుపాటు జీవనం సాగించి షష్టిపూర్తి చేసుకున్న సందర్భాలు మనం గతంలో చూశాం. కాని ఇప్పుడులా లేదు..చిన్న చిన్న కారణాలు, ఎదురయ్యే సమస్యలకు తలొంచి నచ్చిన విధంగా ఉండాలనే ఒకేఒక్క ఆలోచనలో కొద్ది కాలానికే విడిపోవడం లేదా మరో మార్గాలను వెతుక్కుంటున్నారు. తాజాగా యూపీలో ఓ యువతి భర్త, ఇద్దరు పిల్లలు ఉండగానే..మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం అది చూసి భర్త తీసుకున్న నిర్ణయం వివాహ వ్యవస్థకు పెద్ద సవాల్ అని చెప్పొచ్చు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఒక భర్త తన భార్యకు మళ్లీ పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, వారి ఇద్దరు పిల్లల బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారింది. భర్త తీసుకున్న నిర్ణయాన్ని కొందరు ప్రశంసిస్తే.. మరికొందరు విమర్శిస్తున్నారు నెటిజన్లు.
Also Read : నలుగురు పిల్లలను గొంతు కోసి చంపి
తన పనుల కారణంగా భర్త బబ్లూ తరచుగా భార్యకు దూరంగా ఉండేవాడు. ఆ సమయంలో అతని భార్య రాధిక స్థానిక యువకుడైన వికాస్‌తో సంబంధాన్ని పెంచుకుంది. ఆ సంబంధం చాలా కాలం పాటు కొనసాగింది. ఈ విషయం బబ్లూకు తెలియడంతో మరో ఆలోచన లేకుండా ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నాడు. మొదట కోర్టుకు వెళ్లి ఆ తర్వాత తన భార్య,ఆమె ప్రేమికుడి వివాహాన్ని ఘనంగా జరిపించాడు.
ఇక వీడియోలో రాధిక వికాస్‌తో దండలు మార్చుకుంటూ కన్నీళ్లతో కనిపించింది. చాలా మంది గ్రామస్తులు వివాహానికి హాజరయ్యారు. కొంతమంది తన భార్య ఆనందం కోసం బబ్లూ చేసిన త్యాగాన్ని ప్రశంసించగా, మరికొందరు అతని నిర్ణయాన్ని విమర్శించారు.సహేతుకం అని అభివర్ణించారు.