తాగేందుకు పైసలివ్వలేదని భార్యకు ఉరివేసి చంపిన భర్త

తాగేందుకు పైసలివ్వలేదని భార్యకు ఉరివేసి చంపిన భర్త

గూడూరు, వెలుగు: మద్యం తాగేందుకు పైసలు ఇవ్వలేదని మహబూబాబాద్ జిల్లాలో భార్యను చంపేశాడో భర్త. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన పిట్టల వెంకటమ్మ(58), కనకమల్లు భార్యాభర్తలు. ఇద్దరు కొడుకులు ఉండగా వారు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వెంకటమ్మ, కనకమల్లు గ్రామంలోనే రోజువారీ కూలి పనులకు వెళ్తుంటారు.

తాగుడికి బానిసైన కనకమల్లు, ఇటీవల తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి మరోసారి తాగేందుకు డబ్బు ఇవ్వాలని భార్యతో గొడవకు దిగాడు. లేవని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కనకమల్లు కండువాతో భార్య గొంతును బిగించి చంపేశాడు. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంట్లోనే భార్య మృతదేహాన్ని వేలాడదీశాడు. ఇంట్లో దాచిన డబ్బును తీసుకుని పరారయ్యాడు. శనివారం ఉదయం ఇంటి పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి పెద్ద కొడుకు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నగేశ్​తెలిపారు.