కామారెడ్డిలో దారుణం: భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం

కామారెడ్డిలో దారుణం: భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం

 కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి పట్టణంలో శనివారం నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త, ఆ తరువాత అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. టౌన్​ సీఐ చంద్రశేఖర్​రెడ్డి,  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి ఆర్బీ నగర్‎లో మోసారపు నర్సింలు(50), మహేశ్వరి(45) దంపతులు నివాసం ఉంటున్నారు. మహేశ్వరి ఓ హోటల్‎లో కార్మికురాలిగా, నర్సింలు  నిజాంసాగర్​ చౌరస్తాలోని సులభ్​కాంప్లెక్స్​లో పని చేస్తున్నారు. 

సులభ్​కాంప్లెక్స్​వద్దకు మహేశ్వరి రాగా, వీరి మధ్య గొడవ జరిగింది. కోపంతో నర్సింలు మహేశ్వరిపై గొంతు, కడుపులో కత్తితో పొడవటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తరువాత నర్సింలు కడుపులో పొడుచుకోవడంతో గాయాలయ్యాయి. కామారెడ్డి, ఆ తరువాత నిజామాబాద్​గవర్నమెంట్​హాస్పిటల్‎కు తరలించారు. శానిటరీ ఇన్స్​పెక్టర్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.