రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పోరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు భర్త. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్, భార్య కృష్ణవేణి పిల్లలతో కలిసి మాధవి నగర్ లో నివాసముంటున్నాడు.
Also Read :- జమ్మూకాశ్మీర్, హర్యానా ఓట్ల కౌంటింగ్
అయితే గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. మంగళవారం ( అక్టోబర్08) శ్రీనివాస్ భార్యను చంపి పిల్లలను తీసుకొని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు శ్రీనివాస్. సంఘటన స్థలంలో క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు పోలీసులు.