మీరు వింటున్నది నిజమే : భార్యను బాయ్ ఫ్రెండ్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త..

ఇన్నాళ్లు భర్తల వివాహేతర సంబంధాలపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్యలను చూశాం.. పోలీసులకు పట్టించిన మహిళలను చూశాం.. ఇక్కడ సీన్ రివర్స్.. భార్యను మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. షాపింగ్ చేస్తుండగా.. రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న భర్త కథ ఇది. కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త.. ఆమెపై నిఘా పెట్టాడు. ఈ క్రమంలోనే తన భార్య.. మరొకరితో సన్నిహితంగా ఉంటూ.. చేతిలో చెయ్యి వేసి.. షాపింగ్ మాల్ లో నడుస్తూ ఉండగా.. స్పాట్ లో పట్టుకున్న భర్త కథ ఇది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూపీ లేదా ఢిల్లీలో జరిగినట్లు సమాచారం ఉంది కానీ.. స్పష్టమైన ప్రదేశం అయితే ఎవరూ చెప్పలేకపోతున్నారు. 

వీడియోలోని సంభాషణలోకి వెళితే.. ఓ వ్యక్తి తన భార్య.. మరొకరితో కలిసి తిరగటాన్ని మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నాడు. ఓ షాపింగ్ మాల్ లో వాళ్లిద్దరినీ షూట్ చేస్తూ ఉండగా.. భార్య గమనించింది. ఎందుకు వీడియో తీస్తున్నావ్ అంటూ భర్తపై ఆవేశంతో దూసుకొస్తుంది. అతను నా స్నేహితుడు అని.. కాదు నా ప్రియుడు అని మరోసారి అంటుంది. ఈ క్రమంలో ఆ భర్త సంభాషణ కూడా వీడియో రికార్డ్ అయ్యింది. మా ఇంట్లో కుటుంబ సభ్యులను టార్చర్ పెడుతుంది.. ఇబ్బంది పెడుతుంది అని అంటాడు. మనం కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకుందాం అంటాడు. భార్య కూడా.. కోర్టులో చూసుకుందాం.. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ.. అందరి ముందు ఏకంగా భర్తను కొడుతుంది. 

ఈ వీడియోలో చాలా అసభ్యకరమైన భాష ఉపయోగిస్తుంది భార్య. నేను ఎవరితో తిరిగితే నీకు ఎందుకు.. నువ్వెవ్వరు నన్ను ప్రశ్నించటానిక అంటూ భర్తపైనే దూకుడుగా వెళ్లటం కనిపిస్తుంది. భర్త వెర్షన్ మాత్రం మరోలా ఉంది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయారని చెబుతున్నాడు. వీళ్లిద్దరి మాటలతో ఒకటి మాత్రం స్పష్టం అయ్యింది. వీళ్లిద్దరూ ఇప్పుడు కోర్టులో వ్యవహారాన్ని తేల్చుకోబోతున్నారు. 

ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త అంటూ ట్రోల్ అవుతుంది. ఇదంతా వీడియోలోని మాటల ఆధారంగా రాయబడిన కథనం. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా రాయబడింది.