అప్పుల బాధతో భర్త ఆత్మహత్య .. అతని భార్య నిండు చులాలు

  • మరో రెండు, మూడు రోజుల్లో డెలివరీ
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘటన

సుల్తానాబాద్, వెలుగు : వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆత్మహత్యాయత్నం చేసిన భర్త శుక్రవారం చనిపోయాడు. పెద్దపల్లి  జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గడి మహల్ కు చెందిన ఎండీ యాకూబ్  పాషా అలియాస్  రాహిల్ (33) స్థానిక మున్సిపల్  కార్యాలయం ఏరియాలో సెల్ పాయింట్  పెట్టుకుని జీవిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో మానసికంగా ఒత్తిడికి గురై ఈనెల 5న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్  నిమ్స్ కు తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం అర్ధరాత్రి అతను మరణించాడు. కాగా ఆయన భార్య నిండు గర్భిణి. మరో రెండు మూడు రోజుల్లో డెలివరీకి డాక్టర్లు టైం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో భర్త మరణించడంతో అతని ఇంట్లో విషాదం నెలకొంది.  కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయేందర్  తెలిపారు.