భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

కరకగూడెం, వెలుగు : పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రావడం లేదని భర్త సూసైడ్​ చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాగారంలో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శోభన్ (36)కు అశ్వాపురం సమీపంలోని తండాకు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. నాలుగు నెలల కింద భార్యాభర్తల మధ్య చిన్న వివాదం ఏర్పడింది. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. 

అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన శోభన్​ గురువారం పురుగుల మందు తాగాడు. అతడిని వెంటనే స్థానికులు మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శోభన్​ శుక్రవారం చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.